![]() |
![]() |

బిగ్ బాస్ అందాల భామ వాసంతి కృష్ణన్ ఎట్టకేలకు ఒక ఇంటిదైపోయింది. తాను ప్రేమించిన పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసేసుకుంది. పెళ్ళైన వెంటనే తిరుమల శ్రీవారి సన్నిధిని దర్శించుకున్నారు కొత్త జంట. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, బుల్లితెర నటీనటులంతా హాజరై.. వీరిని ఆశీర్వదించారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో వాసంతి, పవన్ కళ్యాణ్ ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.
.webp)
వాసంతి కృష్ణన్ కన్నడ ఇండస్ట్రీ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సిరిసిరి మువ్వలు, గోరింటాకు వంటి సీరియల్స్‌తో పాపులర్ అయ్యింది. సంపూర్ణేష్ బాబు మూవీ "కాలీఫ్లవర్" లో నటించింది. గేమ్ ఆన్, భువన విజయం వంటి చిత్రాల్లో వాసంతి అద్భుతంగ నటించింది. ఐతే సీరియల్స్ కానీ మూవీస్ కానీ వాసంతికి పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు కానీ బిగ్ బాస్ మాత్రం ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టింది. బిగ్ బాస్ హౌస్‌లో తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత ప్రసారమైన బీబీ జోడీలో తన డాన్స్ పెర్ఫామెన్స్‌తో జడ్జెస్ మనసులను దోచుకుంది. ఐతే వాసంతి వాళ్ళ నాన్న ప్రజారాజ్యం పార్టీలో కీలక నేతగా పని చేశారు ఇప్పుడేమో వపన్ కళ్యాణ్ జనసేన పార్టీకి తన సేవలందిస్తున్నారు. వీళ్ళ పెళ్ళికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గీతూ రాయల్, అర్జున్ కల్యాణ్, సత్య, ఇనయా, ఆర్జే సూర్య తదితర బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హాజరై వాసంతి, పవన్ కు అభినందనలు తెలిపారు. ఐతే వాసంతి హజ్బెండ్ పవన్ కళ్యాణ్ కూడా టాలీవుడ్ నటుడే.హీరోగా ఓ రెండు సినిమాలు కూడా చేస్తున్నాడు.వీరి హల్దీ వేడుక ఫోటోలు నెట్టింట్లో ఫుల్ వైరల్ అయ్యాయి.
![]() |
![]() |